Eye medical camp | చిగురుమామిడి, జూలై 4: మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో శుక్రవారం ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించారు. శ్రీనివాస విజన్ సెంటర్, అక్షర ఎడ్యూకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 200 మంది వరకు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.
కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం శుక్లాం ఆపరేషన్ అవసరమైన 19 మందిని ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా ప్రత్యేక వాహనంలో హైద్రాబాద్ లోని ఆసుపత్రి తరలించామని, గ్రామీణ ప్రాంత ప్రజలు ఇలాంటి అవకాశలను వినియోగించూసుకోవాలని కంటి పరీక్ష నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు.
ఈ శిబిరంలో బుర్ర శ్రీనివాస్ గౌడ్, జక్కుల బాబు, ముంజ ప్రకాష్ గౌడ్, బండి ఆదిరెడ్డి, జక్కుల స్వామి, పచ్చిమట్ల అజయ్ కుమార్ గౌడ్, రాజు గౌడ్, ముత్యాల మహేందర్, కక్కర్ల సంపత్ కుమార్ తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.