Chigurumamidi | రేకొండలో ఉచిత కంటి వైద్య శిబిరం
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గంగిశెట్టి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
Chigurumamidi | చిగురుమామిడి, మే 9: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గంగిశెట్టి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో శ్రీనివాస విజన్ సెంటర్, మెడికవర్ హాస్పిటల్ కి చెందిన వైద్య సిబ్బంది 258 మందికి ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
29 మందికి కంట్లో పొరలు ఉన్నట్టు గుర్తించి వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని కంటి వైద్య నిపుణులు తిప్పారపు శ్రీనివాస్ తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొన్న రోగులందరికీ ఉచితంగా భోజన వసతి కల్పించారు. వైద్య శిబిరంలో ట్రస్ట్ ఫౌండర్ గంగిశెట్టి జగదీశ్వర్, సర్పంచ్ అల్లేపు సంపత్, కారోబార్ పీరల్ల రాజకుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ గోపగోని తిరుపతి, సతీష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

