Kolanuru Government School | ఓదెల, జులై 3 : పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను శుక్రవారం వితరణ చేశారు. హైదరాబాదులోని ప్రముఖ బేసిక్స్ సీఈవో, కొలనూరు పాఠశాల పూర్వ విద్యార్థి దేవరకొండ సత్యనారాయణ ఈ బ్యాగులను అందించారు. పాఠశాలలో కొత్తగా చేరిన ఆరో తరగతి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు నిట్టూరి యేసుదాసు, ఉపాధ్యాయుల చేతుల మీదుగా ఈ స్కూల్ బ్యాగులను అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యేసుదాసు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండగా నిలుస్తూ తమవంతు సామాజిక బాధ్యతగా స్కూల్ బ్యాగులను అందించిన బేసిక్స్ కంపెనీ సీఈవో సత్యనారాయణ ఇందుకు చొరవ చూపిన పూర్వ విద్యార్థి అయిన జీగురు ఐలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.