కార్పొరేషన్/ కలెక్టరేట్మే 28: అన్ని వర్గాల అ భ్యున్నతే సర్కారు లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అన్నారు. ఈ దిశగా అనేక సంక్షేమ పథకాలను అమలు చే స్తున్నదని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని ఎస్ఎస్ గార్డెన్స్‌లో హాకర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ముస్లిం అభ్యర్థుల కోసం జిల్లా మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ముస్లిం ఎ డ్యుకేషన్ సొసైటీలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడారు. వీధివ్యాపారాలు చేసుకునే హాకర్స్ కు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎలాం టి సమస్యలు వచ్చిన మేయర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హాకర్స్ కోసం పట్టణాలు, నగరాల్లో సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్నివర్గాలు సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. సమైక్య పాలకులు తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, సాగునీరు అందదని విమర్శించారనీ, కానీ ఇప్పుడు 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు, సాగునీరు అందిస్తున్నామని గుర్తుచేశారు. కాళేశ్వ రం లాంటి భారీ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసిన ఘనత ఈ సర్కారుకే ద క్కిందన్నారు. కాళేశ్వర జలాలతో మండుటెండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయన్నారు. ఉమ్మ డి పాలనలో మైనార్టీ పిల్లలు కార్ఖానాల్లో కార్మికులుగా, పండ్లను అమ్ముకుంటూ బతికేవారని, కానీ తెలంగాణలో వారి బతుకులు మారాయని చెప్పా రు. చదువుకుంటుండడంతో ఆర్థికంగా పురోగమిస్తున్నారని పేర్కొన్నారు.
ముస్లిం మహిళలు వంటింటికే పరిమితం కావద్దని, చదువుకొని అన్నిరంగాల్లో రాణించాలని కోరారు. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్ నేతల తప్పుడు మాటలు నమ్మవద్దన్నారు. అతి త్వరలోనే గృహాలక్ష్మి కింద సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లు కట్టుకొనేందుకు రూ.3 లక్షలు అందించనున్నామన్నారు. తెలంగాణలో మహిళలకు అ త్యధిక ప్రాధాన్యత ఇచ్చి వారి పేరుతో అన్ని సంక్షే మ పథకాలను అందిస్తున్నామన్నారు. హాకర్స్ సమస్యలకు పరిష్కారానికి తన వంతు సహాయ సహాకారాలను అందిస్తానన్నారు. మెప్మా సిబ్బందితో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూ స్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో మేయర్ సునీల్‌రావు, హాకర్స్ అసోసియేషన్ నాయకులు అతీమ్, అలీ, మైనార్టీ వెల్ఫేర్ అధికారి పీ మధుసూదన్, ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ జహీరొద్దీన్, నేతలు పేర్యాల రవీందర్రావు, దూలం సంపత్, జీఎస్ ఆనంద్, మాజిద్ పాల్గొన్నారు.