challoor | వీణవంక, అక్టోబర్ 20 : దహనసంస్కారాలకు హాజరైన ఘటనలో నలుగురికి తేనేటీగలు కుట్టి గాయాలపాలయ్యారు. ఈ ఘటన వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చల్లూరు గ్రామానికి చెందిన కల్వల చంద్రయ్య అనారోగ్యంతో మృతిచెందాడు.
కాగా చంద్రయ్య దహన సంస్కారాలు చేస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా అక్కడున్నవారిని చుట్టిముట్టాయి. ఈ ఘటనలో తేనెటీగలు మృతుడి కుమారుడు కల్వల సమ్మయ్య(45), కోడలు కల్వల సమ్మక్క(40), మనవడు కల్వల మహేష్ (25), అల్లుడు కొమ్మగాళ్ల నాంపల్లి (48)పై దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. కాగా స్థానికు 108కు సమాచారం చేయగా వాహనంలో ఈఎంటీ ఐలవేణి కుమారస్వామి, పైలట్ చిలుమల దేవయ్య అత్యవసర ప్రథమ చికిత్స అందించి జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.