రాయికల్, మే 8: విద్యారంగానికి సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాల కల్పనకే ‘మన ఊరు-మనబడి’ లాంటి బృహత్తర పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. రాయికల్ మండలంలోని అల్లీపూర్ జడ్పీస్కూల్‌లో సోమవారం ఈ స్కీం కింద రూ.1. 29 కోట్ల తో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే గ్రామానికి చెందిన ముగ్గురికి రూ.1.80 లక్షల సీఎఆంర్ఎఫ్ చెకులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కండ్లన్నారు. రాయికల్ పట్టణం, మండలంలోని 18 స్కూళ్లలో రూ.10 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు.
అల్లీపూర్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు. సీసీ, బీటీ రోడ్లకు రూ.87లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. గతంలో నియోజకవర్గంలో 6 జూనియర్, రెండు డిగ్రీ కాలేజీలు ఉంటే, రాష్ట్రం ఏర్పడిన తరువాత మరో రెండు జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల, గురుకులాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.19లక్షలతో రైతు వేదిక నిర్మించామన్నారు. రైతుబంధు ద్వారా 2029 మంది రైతులకు రూ.21.68 కోట్ల మేర లబ్ధిజరిగిందని తెలిపారు. రైతుబీమా ద్వారా 15 మంది రైతుల కుటుంబాలకు రూ.75 లక్షలు రైతు కుటుంబాలకు చెల్లించామని పేర్కొన్నారు. 330 మందికి కల్యాణ లక్ష్మి చెకుల ద్వారా రూ.3.30 కోట్లు, 1580 మందికి ఆసరా పెన్షన్ల ద్వారా నెలకు రూ.32లక్షల 81 వేల చొప్పున అందజేస్తున్నామన్నారు. 805 మంది బీడీ కార్మికులకు నెలకు రూ.16 లక్షల చొప్పున పింఛన్ ఇస్తున్నామన్నారు.
గ్రామంలో రూ. కోటి వెచ్చించి చెరువులను బాగుచేసుకున్నామని పేర్కొన్నారు. దీంతో యాసంగిలోనూ చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు. పల్లెప్రగతి కింద గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతినెలా నిధులు మంజూరు చేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగారెడ్డి, ఎంపీపీ సంధ్యారాణి, పాక్స్ చైర్మన్లు రాజ లింగం, రాజీరెడ్డి, ఎంపీటీసీ మోర విజయలక్ష్మీ వెంకటేశ్, ఉప సర్పంచ్ సాగర్‌రావు, ఎస్ఎంసీ చైర్మన్ కల్యాణి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రత్నాకర్ రావు, మండల సర్పంచుల ఫోరం శ్రీనివాస్, జిల్లా ఎంపీటీసీల ఫోరం నాగరాజు, సర్పంచ్‌లు రామచందర్ రావు, చంద్రశేఖర్, మండల మహిళా అధ్యక్షురాలు స్పందన, ఎంపీడీఓ సంతోష్, డీఈ భాసర్, హెచ్ఎం వెంకటయ్య, ఎస్టీ సెల్ నేత బాపురావు, నాయకులు వెంకటేశం, గోపి, శ్రీనివాస్, కొత్తపెల్లి ప్రసాద్, బరం మల్లేశ్ యాదవ్, సాయి కుమార్ పాల్గొన్నారు.