Chirumilla Rakesh | పెద్దపల్లి రూరల్ ఆగస్టు 25 : పెద్దపల్లికి చెందిన సీనియర్ రిపోర్టర్ లైశెట్టి రాజు, బీఆర్ఎస్ నాయకుడు మాజీ కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి తండ్రి, మాజీ వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య మామ భూమయ్య ఇటీవల మృతి చెందాడు. కాగా వారి కుటుంబాన్ని టీఎస్టీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమిల్ల రాకేష్ సోమవారం పరామర్శించారు.
ఈ మేరకు వారి స్వగ్రామం దొంగతుర్తిలో జరిగిన దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని భూమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.