మానకొండూర్, మార్చి 2 : తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలకమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ గుర్తు చేశారు. మానకొండూర్‌లో ఏర్పాటు చేసిన కళాకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కళాకారులు ధూంధాం కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
సమాజంలో కళాకారులకు గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 500 పైచిలుకు మందికి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలను కల్పించినట్లు తెలిపారు. ఈ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, కళాకారులు వొల్లాల వాణి, జక్కుల నాగరాజుయాదవ్, సాయికృష్ణ, ఓంకార్, నాయకులు ఏల శేఖర్‌బాబు, శాతరాజు యాదగిరి, నెల్లి శంకర్ పాల్గొన్నారు.