JEEVAN REDDY | సారంగాపూర్ : మండలంలోని రంగపేట గ్రామంలోని శ్రీసీతారామంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల్లో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అలాగే మండలంలోని వడ్డెర కాలని గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామడుగు రవి, మాజీ ప్రజాప్రతినిధులు మాలేపు సుధాకర్, రమేష్, పల్లపు వెంకటేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.