కొడిమ్యాల, ఆగస్టు 21: రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేసిన సర్కారుపై రైతులు భగ్గుమన్నారు. పూడూర్లో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆందోళనలో పాల్గొన్నారు.
రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ఆందోళన తీవ్రం కావడం, గంటపాటు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో సుంకె రవిశంకర్‌ను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. ఖాకీల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం ప్ర జాపాలన అని నిలదీశారు. ఏకకాలంలో పంట రు ణాలు మాఫీ చేస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు అరకొరగా లోన్లు మాఫీ చేసి నిండా ముంచారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలతో పాటు రైతుభరోసాను ఎగ్గొట్టేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు.
ఇప్పటికైనా ఇచ్చిన ప్ర తి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ ఆందోళనలో తిర్మలాపూర్ సింగిల్ విండో చైర్మన్ పొలు రాజేందర్, మండల సర్పంచుల ఫోరం మా జీ అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, మాజీ సర్పంచులు ఏగుర్ల తిరుపతి, గరిగంటి మల్లేశం,సయ్యద్ హైదర్, నాయకులు బోడ్డు రమేశ్, మల్యాల నరేశ్, గోలి ఐలయ్య, సల్మాన్, సురబీ సాగర్‌రావు, రేకులపల్లి తిరుపతిరెడ్డి, ఒల్లాల లింగాగౌడ్, రాచకొండ చంద్రమోహన్, గుంటి తిరుపతి,కొత్తూరి స్వామి, చాంద్‌పాషా, పర్లపల్లి సురేశ్ పాల్గొన్నారు.