బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల కేసీఆర్ పేరుమీద అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
– మల్యాల, డిసెంబర్ 9
మల్యాల, డిసెంబర్ 9 : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తం గా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆయాచోట్ల అర్చనలు, అభిషేకాలు నిర్వహించి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా అంజన్న ఆలయ ప్రాకార మండపంలో కేసీఆర్ గోత్రనామాల మీద అర్చన చేయడంతోపాటు స్వామివారికి సంకల్ప పూజ, అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల రవిశంకర్ మాట్లాడుతూ కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని, తొంటికి శస్త్రచికిత్స నిర్వహించినందున త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు బద్దం తిరుపతిరెడ్డి, మిట్టపల్లి సుదర్శన్, పునుగోటి కృష్ణారావు, సహకార సంఘ అధ్యక్షులు మేన్నేని రాజనర్సింగరావు, బోయినిపల్లి మధుసూదన్‌రావు, అయిల్నేని సాగర్‌రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుభాన్, మండల కోఆప్షన్ సభ్యుడు అజహర్, నాయకులు జనగం శ్రీనివాస్, క్యాతం భూపతిరెడ్డి, గడ్డం మల్లారెడ్డి, పొన్నం మల్లేశం, జున్న సురేందర్, అయిల్నేని కోటేశ్వర్రావు, ఆసం శివకుమార్, ఉప్పుల గంగయ్య, తిరుమలేశ్, తాటిపాముల రాజేందర్, మొత్కు కొమురయ్య, కొండయ్య, త్రినాథ్, మహేశ్ పాల్గొన్నారు.