Sunke Ravi Shankar | మల్యాల, జూన్ 22: మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మృతికి గల కారణాలను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్ రావు, మాజీ ఎంపీపీ ఎడిపల్లి అశోక్, మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, నాయకులు కోటేశ్వరరావు, సురేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.