చిగురుమామిడి, సెప్టెంబర్ 30 : హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ వోడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అంజయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం బస్టాండ్ వద్ద బస్సులలో ప్రయాణికులకు సీట్లు, పండ్లు పంపిణీ చేశారు. 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న సతీష్ కుమార్ హుస్నాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని వారు కొనియాడారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బిఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. దసరా పండుగ అనంతరం మండలంలోని అన్ని గ్రామాల్లో ఇన్చార్జీలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తలను చైతన్యవంతం చేస్తామన్నారు. ఈనెల 4న బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, 5 వ తేదీ ముదిమాణిక్యం, రామంచ, సీతారాంపూర్, లంబాడి పల్లి, చిగురుమామిడి, సుందరగిరి 6 వ తేదీ రేకొండ, ముల్కనూర్ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.