Former MLA Satish Kumar | చిగురుమామిడి, నవంబర్ 8: చిగురుమామిడి మండలంలోని ఓగులాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు బోయిని శంకర్ కూతురు, ఇందుర్తి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి అందే స్వామి కుమారుడు సంతోష్ కుమార్-దీక్షిక వివాహం మండలంలోని చిన్న ముల్కనూర్ గ్రామంలోని రాజా గార్డెన్ లో శనివారం జరిగింది. కాగా ఈ వివాహానికి హుస్నాబాద్ మాజీ శాసనసభ్యుడు వోడితల సతీష్ కుమార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వివాహానికి హాజరైన నాయకులతో మాట్లాడారు.
వీరి వెంట మాజీ ఎంపీపీ కొత్త వినీత, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి, మండల నాయకులు ఆర్కే చారి, పెసరి రాజేశం, పెనుకుల తిరుపతి, సన్నిల్ల వెంకటేశం, చెప్యాల నారాయణరెడ్డి, బరిగెల సదానందం, అనుమాండ్ల సత్యనారాయణ, గ్రామ శాఖ అధ్యక్షులు ఎస్కే సిరాజ్, నాగెల్లి రాజిరెడ్డి, బుర్ర తిరుపతి, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాగా వీరితోపాటు సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీలు కూన శోభారాణి, వీరమల్ల శేఖర్, ఎంపీడీవో విజయ్ కుమార్, తహసీల్దార్ రమేష్, మండల పరిషత్ సూపరింటెండెంట్ ఖాజామోహినుద్దీన్, ఎంపీవో కిరణ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బోయిని అశోక్, సింగిల్ విండో డైరెక్టర్లు చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకోల రాజయ్య, పోలోజు సంతోష్ కుమార్, నాగెల్లి లక్ష్మారెడ్డి, గోలి బాపురెడ్డి, కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, బూడిద సదాశివ, ఎలగందుల రాజయ్య, కూన లెనిన్ తదితరులు హాజరయ్యారు.