Putta Madhukar | ముత్తారం, జూన్ 19: మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు పప్పు స్వరూప తండ్రి కొండవేన కనకయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్తో పాటు ఆయన సతీమణి మంథని మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజలు కనుకయ్య పార్థీవదేహాన్నీ సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి, మాజీ ఎంపీపీలు అత్త చంద్రమౌళి, జక్కుల ముత్తయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజీరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుదాడి రవీందర్ రావు, మండల సర్పంచ్ లఫోరం మాజీ అధ్యక్షుడు నూనే కుమార్, నాయకులు తాత బాలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.