మంథని, డిసెంబర్ 27: అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో పని చేస్తూ పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. అయినా ఆ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు నమోదు చేసిన కే సులు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లకు వెళ్లి శాలువాలు కప్పించుకోవడంపై డీజీపీకి, సీఎం, గవర్నర్, చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేస్తామని, అలాగే వీటన్నింటిపై అన్ని వేదికలను ఆశ్రయిస్తామని చెప్పారు. మంథనిలోని రాజగృహలో శుక్రవారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గోదావరిఖని, మంచిర్యాలలో ఏసీపీలు పోలీస్ వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక వార్డు మెంబర్‌గా కూడా గెలువలేని స్థితి లో ఉన్న కాంగ్రెస్ నాయకుడి ఇంటికి వెళ్లి మరీ శాలువాలు కప్పించుకోవడమే అందుకు నిదర్శనమని చెప్పారు. ఆ ఇద్దరు వ్యవహరించిన తీరు పో లీస్ శాఖకే మచ్చ తెచ్చిపెట్టేలా ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరి పేర్లు చెప్పితే ఆ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న రామగిరి మండలానికి చెందిన పూదరి సత్యనారాయణగౌడ్‌పై ఆరు నెలల కాలంలో తొమ్మిది కేసులు నమోదు చేశారని, ఒక్కటే అంశంపై నాలుగు కేసుల ను బుక్ చేశారన్నారు.
ఒకే అంశంపై కేసులు పెట్టవద్దనే నిబంధన ఉన్నప్పటికీ ఆ ఏసీపీలు బేఖాతరు చేశారన్నారు. కోర్టులు, వ్యవస్థలు ఉన్నాయనే విషయాన్ని మరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మంథనిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించ డం సరికాదని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, పోతుపెద్ది కిషన్‌రెడ్డి, శంకెసి రవీందర్, జక్కు ల ముత్తయ్య, పూదరి సత్యనారాయణగౌడ్, గుజ్జుల రాజిరెడ్డి, నూనె కుమార్, మాచిడి రాజుగౌడ్, కాయి తి సమ్మయ్యతోపాటు తదితరులు పాల్గొన్నారు.