Putta Madhu | ముత్తారం, జులై 09: మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో నిమ్మతి చంద్రయ్య ఇటివల మరణించగా ఆ కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బుధవారం పరామర్శించారు. ముందుగా మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలో ఇటీవల పాము కాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు అమ్ము కుమార్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి, అధ్యక్షుడు అలువోజు రవీందర్, కురాకులు ఓదెలు, గట్టు రమేష్, శేరు స్వామి, నిమ్మతి రమేష్, నిమ్మతి సంపత్, మల్యాల రాజయ్య, కలవేన బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.