Former MLA Dasari Manohar Reddy | పెద్దపల్లి రూరల్, నవంబర్ 5 : పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లిలో కొలువై ఉన్న దేవునిపల్లి శ్రీలక్ష్మినృసింహ స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం అశేష భక్తజనసందోహం మధ్య కమనీయంగా జరిగింది. ప్రతీయేటా కార్తీక మాసంలో ఆనవాయితీగా వచ్చే ఈ జాతర కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీలక్ష్మి నృసింహ స్వామి కల్యాణ మహోత్సవంతో ప్రారంభమై ఐదు రోజుల అనంతరం రథోత్సవంతో ముగుస్తుంది. ఇందులో భాగంగానే బుధవారం స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని దేవాలయ ఈవో ముద్దసాని శంకరయ్య పర్యవేక్షణలో ఆలయ ప్రదాన పూజారి కొండపాక శ్రీకాంతాచార్యుల ఆధ్వర్యంలో బ్యాండ్, మేళతాళాలు, పూజారుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కమనీయంగా నిర్వహించారు.
ఈ కల్యాణ మహోత్సవ కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జి దాసరి మనోహర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరిని ఆలయ ఈవో సాంప్రదాయ బద్దంగా, మర్యాద పూర్వకంగా ఆహ్వానించగా పూజారుల వేదమంత్రోచ్ఛారణల మధ్య పూలమాల శాలువాలతో స్థానిక నాయకులతో కలిసి సన్మానించారు.
అలాగే పెద్దపల్లి జోన్ డీసీపీ కరుణాకర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్, పెద్దపల్లి సివిల్, ట్రాఫిక్ సీఐలు ప్రవీణ్ కుమార్, బర్ల అనిల్ కుమార్, ఎస్సైలు మల్లేష్ హాజరై ప్రత్యేక పూజలు చేసి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన పూజారి కొండపాక శ్రీకాంతాచార్యుల ఆధ్వర్యంలో కంజర్ల రామాచార్యులు, కంజెర్ల ప్రసాదాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో ముద్దసాని శంకరయ్య, జాతర కమిటీ చైర్మన్ బొడ్డుపల్లి సదయ్య, మాజీ ఉపసర్పంచ్ లు బొక్కల సంతోష్, తలారి స్వప్న సాగర్, మాజీ ఎంపీటీసీ పందిల్ల లక్ష్మణ్, మాజీ సర్పంచ్ లు రాయిశెట్టి కిషన్ పటేల్ , ముద్దసాని ప్రభాకర్ రెడ్డి, గుండ లక్ష్మినారాయణ, అంతగిరి కొమురయ్య, బొడ్డుపల్లి ఓదెలు, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కొయ్యెడ సతీష్ గౌడ్, సోషల్ మీడీయా కన్వీనర్ ఎండీ ఖదీర్, భూర్ల దనుంజయ, చిట్యాల కిషన్, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరనేని నిశాంత్ రావు, గుమ్మడి సదయ్య, ఆవుల అఖిల యాదవ్ తదితరులు పాల్గొన్నారు.