Koppula Eshwar | ధర్మారం, మే 4: ధర్మారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పూస్కురు జితేందర్ రావును ఆదివారం రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తు జితేందర్ రావు చేతికి గాయం కావడంతో ఆయన ఇంటికి వచ్చిన ఈశ్వర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విశ్రాంతి తీసుకొని త్వరగా పార్టీకి సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.
ఆయన వెంట స్థానిక మాజీ జెడ్పీటీసీ పూస్కూరు పద్మజ, మాజీ ఎంపీటీసీ సభ్యులు తుమ్మల రాంబాబు, మిట్ట తిరుపతి, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి మల్లారెడ్డి ,మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, పార్టీ నాయకులు పెంచాల రాజేశం ,పూస్కూరు రామారావు, కూరపాటి శ్రీనివాస్ ,ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, దేవి నలినీకాంత్, అజ్మీరా మల్లేశం, నార ప్రేమ్ సాగర్, దేవి రాజేందర్, గంధం తిరుపతి, రాగుల చిన్న మల్లేశం తదితరులు పాల్గొన్నారు.