Dharmaram | ధర్మారం, ఆగస్టు 27 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, వార్డు సభ్యుడు నారా ప్రేమ్ సాగర్ సోదరుడు విద్యాసాగర్ – హరిత శ్రీ వివాహ మహోత్సవం గురువారం మండల పరిధిలోని ఖిలావనపర్తి లక్ష్మీనృసింహ స్వామి కళ్యాణ మండపంలో జరగా రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈశ్వర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు.మాజీ మంత్రి వెంట మేడారం పిఎసిఎస్ ఛైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాసూరి శ్రీధర్, నాయకులు పాకాల రాజయ్య, ఎగ్గేలా స్వామి, అయిత వెంకటస్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.