బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ తరఫున స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు శనివారం రాత్రి నగరంలో ప్రచారం చేయగా, జనం నీరాజనం పలికారు. 9వ డివిజన్ (రాంపూర్)లో ఇంటింటా ఓట్లు అభ్యర్థించగా, ఆడబిడ్డలు మంగళహారతులతో స్వాగతించారు.
డివిజన్లోని పలు వీధుల్లోని వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోనూ ప్రచారం చేయగా, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభ్యర్థి వినోద్‌తో కలిసి హరీశ్‌రావు ఇల్లిల్లూ తిరుగుతూ.. ఆప్యాయంగా మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పరిస్థితులు ఎలా ఉండేవని, ఇప్పుడు ఎలా ఉన్నాయని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని, ఇప్పుడు అలా లేదని స్థానికులు తెలుపగా.. ఉద్యమ నాయకుడు, మేధావి అయిన వినోద్‌కుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.