ధర్మారం, ఆగస్టు 1: రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర నేత కొప్పుల ఈశ్వర్ అందరివాడు కావడం వల్లే ఆయన వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన వారిలో ఒకరని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్, జిల్లా సహకార సంఘాల ఫోరం చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలా వనపర్తి, బుచ్చయ్యపల్లి గ్రామాలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ సమన్వయ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఖిలావనపర్తి గ్రామంలో పార్టీ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి సామంతుల రవి, బుచ్చయ్యపల్లి గ్రామంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవి గులాబీ జెండాలను ఆవిష్కరించారు. ఆయా గ్రామాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్యాక్స్ చైర్మన్ బలరాం రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి గ్రామ గ్రామాన వ్యూహరచన చేయడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈశ్వర్ 2004 నుంచి 18 వరకు వరుసగా 6 సార్లు ప్రజల మద్దతుతో పాత అసెంబ్లీ నియోజకవర్గ మేడారంలో 2 సార్లు, ధర్మపురి నియోజకవర్గంలో 4 నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినా ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. ఈశ్వర్ పార్టీలకతీతంగా 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించి మన్ననలు పొందాడని అన్నారు. ఒక పర్యాయం రాష్ట్ర విప్ గా, మరో పర్యాయం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల శాఖ మంత్రిగా విశిష్ట సేవలు అందించిన ఘనత ఈశ్వర్ కే దక్కిందని అన్నారు. నేడు పదవి లో లేకున్నా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ ఉంటున్నాడని అన్నారు. అలాంటి నాయకుడైన ఈశ్వర్ ఆదేశాల మేరకే గ్రామ గ్రామాన స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడాలని ఉద్దేశంతో సమన్వయ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామాలలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థలు ఎన్నికలను ఎదుర్కోవడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. అందరూ ఏకధాటిపై ఉండి పార్టీ అభ్యర్థుల విజయం కోసం అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను వంచించిందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ప్రకారం ఏ సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు కావడం లేదనే విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని వారు విమర్శించారు.
కేవలం గద్దెనెక్కడానికి మాత్రమే ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానాలను పొందుపరిచి ఆ తర్వాత వాటిని అమలు చేయడం లేదని వారన్నారు. పాలనలో గాని ప్రభుత్వ సంక్షేమల పథకాల అమలు గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెల నెల రూ.2,500 సహాయాన్ని ఇవ్వడం లేదని, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ. లక్షకు తోడు తులం బంగారం హామీ నెరవేరడం లేదని, ప్రభుత్వ దవాఖానాల్లో సాధారణ ప్రసవం పొందిన మహిళలకు ప్రోత్సాహకంగా నగదు తో పాటు కిట్ ఇవ్వడం లేదని వారు అన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది వివిధ రకాల పదవులు అనుభవించి కొందరు పార్టీని వీడి వలస పక్షుల మాదిరిగా ఇతర పార్టీలలో చేరుతున్నారని వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామాలలో నిఖార్సైన పార్టీ కార్యకర్తలతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని బుచ్చిరెడ్డి, మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతీ పార్టీ కార్యకర్త పార్టీ ఆదేశానుసారం నడుచుకోవాలని గ్రామాలలో పార్టీలో ఎలాంటి విభేదాలు ఉండవద్దని ఆయన హితవు పలికారు. పార్టీలో కొందరు గ్రూపు రాజకీయాలు చేసిన వారు పార్టీని వీడి వెళ్లారని వారితో ఒరిగేది ఏమీ లేదని అన్నారు. పార్టీ నుంచి వలసలు వెళ్లినవారు ఏనాడు కూడా పార్టీకి సహకరించిన సందర్భాలే లేవని అన్నారు.
ఈ సమావేశాలలో ప్యాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు పూస్కురు రామారావు, మాజీ మండలాధ్యక్షుడు పాకాల రాజయ్య, ఖిలా వనపర్తి మాజీ ఎంపీటీసీ మోతే సుజాత శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచులు కీసర స్వరూప రాణి స్వామి, ఆవుల లత ఏఎంసి మాజీ డైరెక్టర్ బొంగాని తిరుపతి, మాజీ ఎంపీటీసీ సభ్యులు తుమ్మల రాంబాబు, దాడి సదయ్య, మిట్ట తిరుపతి, పాకాల రాజయ్య, ఆయా గ్రామాల పార్టీ నాయకులు ఠాకూర్ హనుమాన్ సింగ్, జంగిలి గట్టు స్వామి, జంగిలి లక్ష్మణ్, మద్దునాల వెంకటేష్ ,కాంపల్లి రాజయ్య ,కనమండ రమేష్, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మణ్ ,పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు కూరపాటి శ్రీనివాస్, దొనికేని తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు నాడెం శ్రీనివాస్ ,పార్టీ అనుబంధ మండలాధ్యక్షులు మంద శ్రీనివాస్, నందాల మల్లేశం, పార్టీ సీనియర్ నాయకులు కాంపల్లి చంద్రశేఖర్, పాక వెంకటేశం, సంధినేని కొమురయ్య ,ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, దేవి రమణ, ఆకారి సత్యం, రెడపాక శ్రీనివాస్, నేరెళ్ల చిన్న లచ్చయ్య గుంటి కొమురయ్య, చెంచు హనుమంతు, బొంగాని సత్యనారాయణ, బొంగాని రాజయ్య, ఆవుల సది సత్రం పోచాలు ,రాగుల చిన్న మల్లేశం, మహిళా నాయకురాళ్లు కాంపల్లి అపర్ణ, మార్క సంధ్య, నెల్లి విజయ, మర్రి మమత, అలువాల సరమ్మ తదితరులు పాల్గొన్నారు.