Putta Madhukar | మంథని, జనవరి 18: ‘కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వచ్చాయని.. ప్రజల సమస్యలు విన్నట్టుగా నటిస్తూ అధికారం కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదు.. మంథని మట్టిలో పుట్టిన బిడ్డను.. ఈ ప్రాంతాన్ని ముద్దాడిన వ్యక్తిని.. ఇక్కడి ప్రజల కళ్లలో కన్నీళ్లు చూశా.. కడుపులో ఆఖలిని చూసినా.. మంథని నియోజకవర్గంలో 80శాతానికి పైగా నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల కోసం తాను పోరాటం చేయక పోతే ఇంకా వెనుకడి పోతారు.. నోట్ల సంచులతో ఓట్లను కొనుక్కునే దుద్దిళ్ల శ్రీధర్ మెడలు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గ ప్రజల సంక్షేమం పోరాటం చేస్తా’ అంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ 2.0పథకంలో భాగంగా స్థానిక పోచమ్మవాడలో చేపట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పుట్ట మధూకర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ పోచమ్మవాడలో 2024 జూలై 15న వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తన్న మంత్రి శ్రీధర్‌బాబు శంఖుస్థాపన చేశారని, ఆ సమయంలో కేవలం 6 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పి ఏడాదిన్నర గడిచి పోయినా కూడా పనులు పూర్తి చేయక పోవడం కాదు కదా కనీసం 30 శాతం కూడ పనులు చేయక పోవడం నిజంగా ఆయన పని తీరుకు అద్దం పడుతున్నదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి శంఖుస్థాపనలు, శిలాఫలకాలు వేయడం తప్ప వాటిని పూర్తి చేయడం తెలియదు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శమన్నారు. కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులిచ్చిన వాటర్ ట్యాంక్ కట్టమన్నా కూడ పనులు చేయడం చూస్తే ఈ ప్రాంతం మీద ఆయనకు ఉన్న ప్రేమ కన్పిస్తున్నదన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేసి అధికారం ఇస్తే దుద్దిళ్ల కుటుంబం అభివృద్ధి చెందుతుంది తప్పా ఈ ప్రాంతం, ఇక్కడి ప్రజలు అభివృద్ధి చెందడం లేదన్నారు.
మళ్లీ ఇప్పుడు కుల సంఘాల భవవాలకు నిధులు మంజూరు చేశామని శిలాఫలాకాలను ప్రారంభించారని, అవి పూర్తవుతాయో లేదో కూడ తెలియదన్నారు. కుల సంఘాలకు వాగులో శిలాఫలకాలు వేయడం ఏంటని దీనిపై మంత్రి క్లారీటీ ఇవ్వాలన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌బాబుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాలన్నారు. తాను గెలిచినా..ఓడినా ప్రజల మధ్యే ఉండే నాయకుడినన్నారు.
అధికారం కోసం తాను పోరాటం చేయడం లేదని, ప్రజల సమస్యల పరిష్కారామే న్యా ధ్యేయమన్నారు. 80 శాతం కన్నా ఎక్కువగా ఉన్న నా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీల కోసం తాను పోరాటం చేయక పోతే.. నోరు మెదపక పోతే ఇంకా వెనుకబడి పోతారన్నారు. అందుకే వారి కోసం మోస పూరిత మాటలు.. నోట్ల సంచులతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రాంత ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, మాచీడి రాజుగౌడ్, ఆరెపల్లి కుమార్, ప్రసాద్‌రావు, పిల్లి సత్తయ్య, కాయితీ సమ్మయ్య, వెల్పుల గట్టయ్య, బాలయ్యలతో పాటు తదితరులు పాల్గొన్నారు.