Dharmaram | ధర్మారంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులతో కలిసి శ్రీధర్ కేక్ కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు.
- 11వ రక్తదానం చేసి కేసీఆర్ పేరిట పచ్చబొట్టు వేయించుకున్న యువకుడు
Dharmaram | ధర్మారం, ఫిబ్రవరి 17: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులతో కలిసి శ్రీధర్ కేక్ కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సాధన జరిగిందని అన్నారు.
సీఎంగా కేసీఆర్ 10 సంవత్సరాల పాటు పరిపాలించి దేశంలోని రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ మాజీ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గుర్రం మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్లు చొప్పరి చంద్రయ్య, కోమటిరెడ్డి మల్లారెడ్డి, రైతుబంధు సమితి మాజీ జిల్లా సభ్యుడు పూస్కురు రామారావు, ఆర్ బి ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పాకాల రాజయ్య, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ,ఖిలవనపర్తి సర్పంచ్ మోతే కనకయ్య, ధర్మారం మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, పార్టీ మండల ఉపాధ్యక్షుడు నాడెం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కూరపాటి శ్రీనివాస్, దొనికేని తిరుపతి గౌడ్, పార్టీ అనుబంధ మండలాధ్యక్షులు గుజ్జేటి కనక లక్ష్మి ,అజ్మీర మల్లేశం, దేవి వంశీకృష్ణ, మహిళా నాయకురాళ్లు కాంపల్లి అపర్ణ మార్క సంధ్య, మర్రి మమత వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసి సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఖిలావనపర్తి లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
మండలంలోని ఖిలావనపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గ్రామ సర్పంచి మోతే కనకయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్ పేరిట ప్రత్యేక అర్చన చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామంతుల రవి, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు పాకాల రాజయ్య, వార్డు సభ్యులు తాళ్ళపెల్లి భాస్కర్, జెంగిలి గట్టుస్వామి, పార్టీ ఎస్సీ సెల్ మండల మాజీ అధ్యక్షుదు మద్దునాల వెంకటేశం,నాయకులు కీసరి స్వామి,తొట్ల అనిల్, మోతె కనకయ్య, ఐలవేణి గణపతి,సిరికొండ కుమార్, గుజ్జెటి శ్రీనివాస్, గుజ్జేటి రాకేష్, మోతె అజయ్, మోతె ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ జన్మదినం సందర్భంగా 11వసారి రక్తదానం

మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ఖిలావనపర్తి గ్రామానికి చెందిన యువకుడు, కేసీఆర్ వీరాభిమాని సాగంటి నరేష్ రక్తదానం చేశాడు. ఇప్పటివరకు 11 సార్లు నరేష్ రక్తదానం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానలో నరేష్ రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇది ఇలా కేసీఆర్ పై ఉన్న అభిమానంతో గత 12 సంవత్సరాల క్రితమే నరేష్ తన చేతిపై కేసీఆర్ పేరుతో కూడిన పచ్చబొట్టు వేయించుకుని తన అభిమానాన్ని చాటాడు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

