Kondagattu | మల్యాల, జూన్ 12: కొడిమ్యాల అటవీ శాఖ పరిధిలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేశారు. కావున దానికి సంబంధించిన పనులను అటవీశాఖ రాష్ట్ర ముఖ్య అధికారి సువర్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా అర్బన్ పార్కులో ఏర్పాటు చేసిన గాజేబాను పరిశీలించడంతో పాటు, కొండగట్టు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వాజ్ టవర్ ద్వారా అటవీ సాంద్రతను పరిశీలించారు.
అనంతరం సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఆమె వెంట బాసర జోన్ చీప్ గా చీప్ కన్జర్వేటర్ శర్వానంద్, జిల్లా అటవీ శాఖ అధికారి వరప్రసాద్, కొడిమ్యాల ఫారెస్ట్ రేంజర్ మోహినుద్దీన్, డిప్యూటీ రేంజర్ మౌనిక, సెక్షన్ ఆఫీసర్ తోట రత్నమ్మ, బీట్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.