Forest festival | ధర్మారం, జూలై 18: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని పెద్దగుట్ట ప్రాంతంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. పెద్దగుట్ట సమీపాన 513 కంపార్ట్ మెంట్ లో పరిధిలో మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. దీంతో గుట్ట ప్రాంతానికి ఉపాధి హామీ పథకంలో ప్రత్యేకంగా రోడ్డు నిర్మించారు.
ఈ క్రమంలో గుట్ట కింద ఉన్న మైదాన ప్రదేశంలో వనమహోత్సవంలో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు 4 వేల మొక్కలు నాటాలని సంకల్పించారు. దీంతో వివిధ శాఖల అధికార యంత్రాంగం అంతా కలిసి వెళ్లి ఉపాధి హామీ కూలీలతో కలిసి వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఐనాల ప్రవీణ్ కుమార్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి స్వాతి, ఎంపీవో రమేష్, ఉపాధి హామీ ఏపీవో నాడెం రవి, ధర్మారం జీపీ కార్యదర్శి కుడిక్యాల రవి, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ గుర్రం సత్యనారాయణ, సెర్ప్ సీసీలు, స్వశక్తి మహిళా సంఘాల సీఏలు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.