karimnagar | తిమ్మాపూర్,ఆగస్టు17: తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలో పురగిరి క్షత్రియ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆవరణలో కులస్తులందరూ కలిసి ఆనందంగా గడిపారు.
కుటుంబ సభ్యులంతా సహపంక్తి భోజనం చేశారు. చిన్నారులు, మహిళలు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పెరిక సంఘం నాయకులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు.