జగిత్యాల, సెప్టెంబర్ 7: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోనే తొలిసారిగా జగిత్యాల జిల్లా వ్యవసాయాధికారి భాసర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు ‘రైతు మిత్ర-ఫార్మర్ ఫ్రెండ్’ కార్యక్రమం చేపడుతున్నారు. కాగా, జగిత్యాల, ధర్మపురి, మెట్పల్లి ఏడీఏ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయాధికారులు ప్రారంభిస్తారు.
ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యక్షంగా రైతులతో సమావేశమై పంటల సాగు, విత్తనాల ఎంపిక, చీడపీడల నివారణ, ఎరువుల వినియోగం, సస్యరక్షణ చర్యలు వంటి అంశాలపై చర్చించి, సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ కోరుతున్నారు.