Godavarikhani | ఫర్టిలైజర్ సిటీ : గోదావరిఖని నగరంలోని సిమ్స్ వైద్యకళాశాల విద్యార్థులకు శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. గోదావరిఖని నగరంలో సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాల(సిమ్స్) చెందిన ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ముగిసాయి.
అనంతరం సరదా గా 12 మంది కవిత థియేటర్ సమీపం లో ని ఓ హోటల్ లో విందు భోజనానికి వెళ్లి మండీ బిర్యానీ ఆరగించాచి తిరిగి ఎవరి రూమ్ లకు వారు వెళ్లి పోయారు. ఇందులో 12 మంది విద్యార్థులలో 11 మంది కి ఫుడ్ ఫాయిజన్ అయింది. దీంతో అందరికీ వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. దీంతో వారిని గోదావరిఖనికి లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే 8 మందికి తీవ్ర, ముగ్గురికి స్వల్పంగా అస్వస్థత కు లోనయినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం వారిని వైద్యుల సలహా మేరకు డిశ్చార్జ్ చేశారు. అయితే హోటళ్లలో నాణ్యతను పరీశీలంచాల్సిన అధికారులు ఇంత జరిగినా పత్తా లేకపోవటం అధికారుల తీరుకు అద్దం పడుతోంది.