జైనూర్ : మండలంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ( BRS ) నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవరావు( Kanaka Yadava Rao ) అన్నారు. జైనూర్ మండలంలోని జెండగూడ గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిగూడ గ్రామంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులు ప్రధానంగా యూరియా కొరత ( Urea shortage ) ను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు అవసరమైన సమయంలో యూరియా అందుబాటు లో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కేంద్రాల్లోనూ, ప్రైవేటు దుకాణాల్లోనూ యూరియా కొరత కారణంగా పంటల సాగు దెబ్బతింటోందని వాపోయారు.
యూరియా పంపిణీలో అమలవుతున్న ఆన్లైన్ విధానం, ఓటీపీలు, సెల్ఫోన్ వినియోగం వంటి అంశాలపై తమకు సరైన అవగాహన లేదని రైతులు వాపోతున్నారని వివరించారు. అనేక మందికి స్మార్ట్ఫోన్ కూడా లేదని, ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని
వారి తరఫున ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించేలా చర్యలు తీసుకోవాలని కోరుతామని తెలిపారు.