Food donation | సుల్తానాబాద్ రూరల్ జూన్ 6 : అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో కందుకూరి ప్రకాష్ రావు పద్మ దంపతుల శుక్రవారం పెళ్లిరోజు ను పురస్కరించుకొని వికలాంగుల కు అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ వివిధ రకాల ఖర్చులను చేయకుండా ప్రతీ ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లి రోజులను పురస్కరించుకొని వికలాంగుల కు అన్నదానం చేయడం వల్ల ఒక పూట వారికి ఆకలి తీరుతుందన్నారు. అన్నదానం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో తృప్తి నిచ్చిందన్నారు.
అమెరికాలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటున్న ప్రకాష్ రావు పద్మ దంపతులకు వికలాంగులు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో రిటైర్డ్ డిఎల్పి ఓ అబ్దుల్ షమీం, కాంగ్రెస్ పార్టీ యువ లీడర్ బిరుదు కృష్ణ , సీనియర్ జర్నలిస్టు లు సామల హరికృష్ణ, కొమురవెల్లి భాస్కర్, యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్, సాజిద్, శ్రీనివాస్, రమేష్ లతోపాటు పలువురు ఉన్నారు.