Akkapalli Cheruvu | ధర్మపురి, ఆగస్టు 19: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. ప్రధాన చెరువులన్నీ నిండుకుండలా మారాయి. పూర్తిగా నిండిన అక్కపెల్లి చెరువు మత్తడి దూకుతున్నది. ధర్మపురి మండలం బుద్దేశ్ పల్లి శివారులోని అక్కపెల్లి చెరువుకు భారీగా వరద నీరు చేరింది. అక్కపెల్లి చెరువు కింద ధర్మపురి, బుద్దేశ్పల్లి, నాగారం, కమలాపూర్, రామయ్యపల్లి, నర్సయ్యపల్లి, కోరండ్ల పల్లి రైతులకు చెందిన దాదాపు 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ధర్మపురి రైతుల పరప్రదాయినిగా చెప్పుకునే అక్కపెల్లి చెరువు వారం క్రితం వరకు ఎడారిని తలపించగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువులోకి భారీగా వరద నీరు చేరి మంగళవారం మత్తడి దూకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..