Flash.. flash.. | ఓదెల : కొలనూరు రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలులో శుక్రవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ఘటన మండలంలోని కొలనూరు రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు కొలనూరు రైల్వే స్టేషనల్లో ఆగింది. ఆ రైలుకు సంబంధించిన ఓ బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
గమనించిన పలువురు ఫైరింజన్‌కు సమాచారం అందించడంతో ఫైరింజన్‌తో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.