Flag festival | పెద్దపల్లి రూరల్ ఆగస్టు 15 : పెద్దపల్లి జిల్లా కేంద్రమైన పెద్దపల్లి తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయం, పెద్దపల్లి , అప్పన్నపేట సింగిల్ విండో కార్యాలయాలతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ 79 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.
ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి, మండల ప్రత్యేకాధికారి కాలిందిని, పెద్దపల్లి, అప్పన్నపేట సింగిల్ విండోలలో చైర్మన్ లు మాదిరెడ్డి నర్సింహరెడ్డి, చింతపండు సంపత్ లు జెండాలను ఎగురవేశారు. అంతకు ముందు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయిబ్ తహసీల్దార్ విజేందర్, రవీందర్ , మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి, వ్యాపారవేత్తలు బాలకిషన్ జాకోటియా, తివారి, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొనగా ఏఎస్ఐ గౌస్ మియా పోలీసు వందనం చేయగా తహసీల్దార్ గౌరవ వందనం స్వీకరించారు. ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ , ఏపిఎం శైలజా శాంతి, ఏపివో రమేష్ బాబు, ఎంపీవో ఎండీ ఫయాజ్ అలీ, మండల వ్యవసాయశాఖ అధికారి కాంతాల అలివేణి, సీఈవోలు మెట్టు మదన్ మోహన్ , గడ్డి తిరుపతి పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.