కలెక్టరేట్, మార్చి 4 : కరీంనగర్ శాసనమండలి పట్టభద్రుల స్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 12 గంటలకు మొదటి రౌండ్ లెక్కింపు ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయింది. రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు చెందిన అభ్యర్థులు ఓట్లను పంచుకోవడంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడగా, బిజెపి అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డి 36 ఓట్ల ఆధిక్యం లభించింది.
మొదటి రౌండ్లో మొత్తం 21 వేల ఓట్లు లెక్కించగా, అంజిరెడ్డికి 6,712, నరేందర్ రెడ్డికి 6,676, ప్రసన్న హరికృష్ణకు 5,867, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సర్దార్ రవీందర్ సింగ్ కు 107, స్వతంత్ర అభ్యర్థులు యాదగిరి శేఖర్ రావుకు 500, మహమ్మద్ ముస్తాక్ అలీకి 156 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో వెనుక బడగా, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మొదటి రౌండ్లో మెజారిటీ సాధించిన అంజిరెడ్డికి మధ్య 845 ఓట్ల తేడా ఉన్నది.