Veenavanka | వీణవంక, నవంబర్ 27 : 108 వాహనంలో విధులు నిర్వహిస్తూ మృతిచెందిన పైలెట్ కుటుంబానికి ఆ సంస్థ ఆర్థిక భరోసా కల్పించి అండగా నిలిచింది. వీణవంక మండల కేంద్రానికి చెందిన గులాం రిజ్వాన్ 108, హెర్సే అంబులెన్స్ పైలెట్‌గా విధులు నిర్వహిస్తూ రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే.
కాగా 108 సంస్థ వెంటనే అతడి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ అందజేశారు. హైదరాబాద్‌లోని 108 సంస్థ కార్యాలయంలో ఈఎంఆర్ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ 108 తెలంగాణ స్టేట్ హెడ్ సుధాకర్, హెచ్ఆర్ హెడ్ కిషోర్‌కుమార్, మృతుడి కుటుంబ సభ్యులకు ఎడ్లీ అమౌంట్ రూ.3,37,254 గురువారం అందజేశారు. వీటితో పాటు ప్రతీ నెల రూ.1500 పింఛన్ కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ జనార్ధన్, కరీంనగర్ జిల్లా ఆపరేషనల్ మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.