Mutharam | ముత్తారం, జూలై 25 : ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన పొలం మల్లక్క ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మృతిరాలి భర్త పొలం పోశాలు, కుమారుడు ప్రవీణ్ కు రూ.2వేల నగదుతో పాటు 25 కేజీల బియ్యం అందించారు. ఆయన వెంట ఉపసర్పంచ్ దాసరి ప్రశాంత్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఐలాపురం లావణ్య కుమారస్వామి, బొమ్మిడి మల్లేష్, పొలం సతీష్, కూన రాజేందర్ తో పాటు తదితరులు ఉన్నారు.