Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 10 : చిగురుమామిడి మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్ కుటుంబం అనాథగా మారడంతో వారి ఇద్దరు కూతుర్లకు రవీందర్ పోలీస్ శాఖలు విధులు నిర్వహించిన 1999 బ్యాచ్ పోలీసు విభాగం అధ్యక్షుడు వావిలాల మల్లారెడ్డి ఆధ్వర్యంలో వారి నివాసంలో రూ.లక్ష నగదు గురువారం అందజేశారు. గీకురు రవీందర్ పోలీస్ శాఖలో ఉన్న తమతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సిరిసిల్లలో పోలీసు ఉద్యోగం వదిలి రాజకీయంపై ఉన్న మక్కువతో సర్పంచ్‌గా రెండు పర్యాయాలు గెలుపొందారని, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారని గుర్తు చేశారు.
మాజీ జడ్పీటీసీగా మండలంలో సేవలందించాలని కొనియాడారు. అనాథలైన ఇద్దరి కూతుళ్లకు అన్ని విధాల అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని అన్నారు. నగదు అందజేసిన వారిలో గుండ కృష్ణ కుమార్ గౌడ్, పుప్పాల శ్రీనివాస్, శంకర్ రెడ్డి, ముత్యాల బ్రహ్మయ్య, కనకయ్య, దామోదర్ రెడ్డి, కాంతారావు, సదాచారి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.