MLA Medipalli Satyam | గంగాధర, ఫిబ్రవరి 15: సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా పండుగలు నిలుస్తాయని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గంగాధర మండలం కొండన్నపల్లి సహస్ర లింగేశ్వర ఆలయంలో ఆదివారం నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు, నిర్వాహకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించి, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివుని ఆశీర్వాదంతో చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని నియోజకవర్గ ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమళ్ళ మనోహర్, సింగిల్విండో మాజీ చైర్మన్ వెలిచాల తిరుమలరావు, సర్పంచులు రేండ్ల జమున శ్రీనివాస్, ముద్దం నగేష్, వేముల భాస్కర్, బీర్ల ఆనందం, కడారి రేణుక కనకయ్య, పడాల భాగ్యలక్ష్మి రాజన్న, రామిడి రాజిరెడ్డి, చిందం ఆంజనేయులు, నాయకులు సాగి అజయ్ రావు, బైరిశెట్టి సంపత్, వేముల అంజి, పెంచాల చందు, తూము రాజకుమార్ తదితరులు ఉన్నారు.