Farmers standing | సారంగాపూర్, ఆగస్టు 31: సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఆదివారం ఉదయం 10టన్నుల యూరియా పంపిణి చేయడంతో రైతులు క్యూలైన్ లో పట్టా పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి బారులు తీరారు. ఎకరానికి ఒక బస్తా సోప్పున పంపిణీ చేశారు.
68 మందికి పంపిణీ చేయగా మరో 70 మంది వరకు యూరియా అందకపోవడంతో వారి పేర్లు సీరియల్ ప్రకారం రాసుకుని పంపించారు. రేపు వారికీ యూరియాను పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు వెళ్లి పోయారు. ఇప్పటి వరకు 378 మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేసినట్లు సీఈవో శివకుమార్ పేర్కొన్నారు.