Organic Fertilizers | చిగురుమామిడి, జూన్ 3: రైతులు అవశేషాలను కాల్చకుండా పొలంలోనే కలిపి సేంద్రియ పదార్థంగా మార్చుకోవాలని వాటిపై రైతులు మొగ్గు చూపాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం చిగురుమామిడి మండలంలోని సుందరగిరి రైతు వేదికలో సర్పంచ్ జంగ శిరీష అధ్యక్షతన రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పంట అవశేషాలు దహనం (స్ట్రగుల్ బర్నింగ్) వల్ల నేలలోని ఉపయోగకర సూక్ష్మజీవులు నశించి నేల సారం తగ్గిపోవడంతోపాటు వాతావరణ కాలుష్యం పెరుగుతుందని అన్నారు. నేల పరీక్షల ఆధారంగా మాత్రమే పంటలను రైతులు వినియోగించాలన్నారు. యూరియా అధికంగా వాడటం వల్ల ఖర్చులు పెరగడంతోపాటు భూసారం దెబ్బతింటుందని అన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయాలని, సన్న రకాల వరి వంగడాల సాగుపై దృష్టి సారించాలన్నారు.
జీవామృతం, ఘనజీవామృతం వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరించాలని సూచించారు. పంటల సాగులో ఏఈఓల సలహా, సూచనలను రైతులు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, పశువైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రణయ్, రాకేష్, అఖిల, సౌమ్య, అంజలి రైతులు పాల్గొన్నారు.
Small Habits | రోజువారీ జీవితంలో చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్లు ఇవే.. వీటిని చేయకూడదు..
Nallagonda | డీసీఎంను ఢీ కొట్టిన మినీ ట్రావెల్ బస్సు..ఒకరు మృతి, 13 మందికి గాయాలు
Rayapol | ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో..భారీగా ట్రాఫిక్ జామ్