Bigg Boss | జబర్ధస్త్ బ్యూటీకి బిగ్ బాస్ ఆఫర్.. ఆమె స్పందన ఏంటి?
Bigg Boss | జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సత్యశ్రీ ప్రస్తుతం సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. టెలివిజన్‌కు దూరంగా ఉంటూ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరీర్ ఎంపికలు, అలాగే బిగ్‌బాస్ ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించారనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Bigg Boss | జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సత్యశ్రీ ప్రస్తుతం సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. టెలివిజన్‌కు దూరంగా ఉంటూ వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరీర్ ఎంపికలు, అలాగే బిగ్‌బాస్ ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించారనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ తర్వాత సినిమాల్లో మంచి అవకాశాలు రావడంతో టెలివిజన్‌లో తక్కువగా కనిపిస్తున్నానని సత్యశ్రీ తెలిపారు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని స్వీకరించినప్పటికీ, ఇప్పుడు మాత్రం పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నానని చెప్పారు.
ఇప్పుడు నేను ఉన్న దశలో నా ఇమేజ్, రెప్యుటేషన్‌ను దృష్టిలో పెట్టుకుని పాత్రలు ఎంచుకుంటున్నాను. గ్లామర్ ఉన్నంతవరకు మంచి అవకాశాలను సెలెక్టివ్‌గా చేయాలనుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో నటించిన సత్యశ్రీ, హీరో నవీన్ పొలిశెట్టి గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సెట్స్‌లో నవీన్ ఎప్పుడూ పనిపైనే దృష్టి పెట్టే వ్యక్తి అని, ప్రతి క్షణం సినిమా గురించే ఆలోచిస్తుంటారని చెప్పారు. నవీన్ గారితో మాట్లాడింది చాలా తక్కువ. కానీ ఆయన పని చేసే విధానాన్ని దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. ‘జాతిరత్నాలు’ సమయంలోనే మరో సినిమాలో కలిసి పని చేద్దామని ఆయన చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకుని ‘అనగనగా ఒక రాజు’లో అవకాశం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా అనిపించింది” అని సత్యశ్రీ తెలిపారు.
ఇటీవల బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 కోసం సత్యశ్రీకి ఆఫర్ వచ్చిందనే వార్తలపై కూడా ఆమె స్పందించారు. ఆ వార్తల్లో నిజం ఉందని, కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.నాకు బిగ్‌బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. కానీ నేను మా కుటుంబ బాధ్యతలను చూసుకుంటున్నాను. అమ్మానాన్నలను అంతకాలం వదిలి వెళ్లడం నాకు సాధ్యం కాదు. వారికి తోడుగా ఉండాల్సిన బాధ్యత నాదే. అందుకే ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాను అని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, కానీ చాలామందికి వారి బాధ్యతలు పంచుకునే వారు ఉంటారని, తన పరిస్థితి మాత్రం భిన్నమని సత్యశ్రీ వివరించారు. అందుకే కెరీర్ కంటే కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చానని స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

