Swine Flu | నాగపూర్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం
Swine Flu | నాగపూర్: నాగపూర్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో 15 కేసులు నమోదు కాగా, ఒక్క మరణించారని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (NMC) వెల్లడించింది.
Swine Flu | నాగపూర్: నాగపూర్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో 15 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (NMC) వెల్లడించింది. ఈ ఏడాదిలో అక్కడ 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఒక్క జూలైలోనే 15 కేసులు బయటపడ్డాయి.
స్వైన్‌ఫ్లూ కేసులు పెరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల్లోని (Districts) అన్ని డివిజన్లలో శ్వాసకోశతో ఇబ్బందిపడేవారిపై దృష్టిసారించారు. ఇందుకు ప్రతిరోజూ హాస్పిటల్స్‌కు వచ్చే రోగులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన మందులను తగినంతగా సిద్ధంగా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వైన్‌ఫ్లూ మరణంపై క్లినికల్ ఆడిట్ (Clinical Audit)ను పరిశీలించాలని ఆరోగ్య కేంద్రాలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జలుబు, విపరీతమైన దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేశారు.
స్వైన్‌ఫ్లూ ఇన్‌ఫ్లూయెంజా A (H1N1) వైరస్ వల్ల సోకుతుంది. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. జలుబు, తీవ్ర జ్వరం, గొంతు, ఒళ్లు నొప్పులు, నీరసం, తొలనొప్పి వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

