Bharatiya Kisan Sangh | మల్లాపూర్, జూలై 02: భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చేపడుతున్న శిక్షణ తరగతులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయ్ భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలో స్థానిక కిసాన్ సంఘ్ నాయకులతో కలిసి బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్యర్యంలో ఆగష్టు 17న మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, దీనికి రైతులు అధిక సంఖ్యలో హజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాసారపు భూమారెడ్డి, మండలాధ్యక్షుడు కల్లెం మహిపాల్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు పోశంపల్లి రమేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు చిట్యాల లక్ష్మణ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.