Sultanabad | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సుద్దాల సింగిల్ విండో చైర్మన్ గడ్డం మహిపాల్ రెడ్డి అన్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం 72వ అఖిల భారత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పీఏసీఎస్ అధ్యక్షుడు గడ్డం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన సహకార జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన వారి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, మినుపాల ఢిల్లేశ్వర్ రావు, వెంగళ్ రావు, ఒజ్జ సమత, పుట్ట సదయ్య, మొండయ్య, నాగయ్య, శ్రీనివాస్, సీఈవో సతీష్, ప్రజాప్రతినిధులు, రైతులు సంఘ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండలంలోని చిన్న కాల్వల పీఏసీఎస్‌లో చైర్మన్ మోహన్ రావు సహకార జెండా ఆవిష్కరించారు. ఇక్కడ పాలక వర్గాల సభ్యులు, సీఈవో రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.