Bhu Bharati program | వీణవంక, జూన్ 3:భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో రమేష్ బాబు సూచించారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ రైతులు ఎలాంటి భూ సమస్యలు ఉన్న రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. రెవెన్యూ సదస్సుకు మొత్తం 155 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ రజిత తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ లక్ష్మారెడ్డి, ఆర్ ఐ రవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.