Urea | ఎల్లారెడ్డిపేట : రైతులెవరూ ఆందోళన చెందొద్దని అర్హలందరికీ సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా సహకార అధికారి టీ రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్నిఆయన మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తో కలిసి బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఈ సీజన్ కు సరిపడా యూరియా సకాలంలో అందిస్తున్నట్లు చెప్పారు. సంఘానికి ఇప్పటివరకు 445 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎల్లారెడ్డిపేట, సర్వేపల్లి గోదాం లలో 1524 బస్తాల యూరియా అందుబాటులో ఉందని అన్నారు.