Sarangapur | సారంగాపూర్, నవంబర్ 3: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మెన్ ఏలేటి నర్సింహరెడ్డి అన్నారు. మండలంలోని నాయకపు గూడెం, ధర్మనాయక్ తండా, అర్పల్లి గ్రామాల్లో సారంగాపూర్ సహకారం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులతో కలిసి సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. గ్రామాల్లో దాళారులను నమ్మి మోసపోవద్దన్నారు. సెంటర్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా నంబర్ ప్రకారం కొనుగోలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో డైరెక్టర్లు కొండ్ర రాంచందర్ రెడ్డి, కాయితి శేఖర్, దాసరి రాజయ్య, మాజీ వైస్‌ఎంపీపీ సొల్లు సురేంధర్, మాజీ ప్రజాప్రతినిధులు గుర్రాల రాజేంధర్ రెడ్డి, ఏలూరి గంగారెడ్డి, భుక్య సంతోష్, బేతి పూర్ణ చంద్రారెడ్డి, ఎండబెట్ల గ్యాబ్రిల్, లక్మారెడ్డి, సీఈఓ శివకుమార్, నాయకులు, రైతులు, సహకార సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.