Kalvasrirampur | ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులు దృష్టిసారించాలి.. పెద్దపల్లి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్యాం ప్రసాద్
రైతులు ఆరుతడి పంటల్లో భాగంగా ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో గోపగోని రంజిత్ వ్యవసాయ భూమిలో పట్టు, ఉధ్యానవన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.
Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, జూలై 17 : రైతులు ఆరుతడి పంటల్లో భాగంగా ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా ఉధ్యానవన శాఖ అధికారి గడ్డం శ్యాం ప్రసాద్ అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో గోపగోని రంజిత్ వ్యవసాయ భూమిలో పట్టు, ఉధ్యానవన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్యాంప్రసాద్ మాట్లాడారు. 2026-27 సంవత్సరానికి మండలంలో ఇప్పటి వరకు 60 ఎకరాల్లో ఆయిల్ఫాం మొక్కలు నాటినట్లు తెలిపారు. మరో 50 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటే లక్ష్యంగా రైతులు ముందుకురావడం సంతోషంగా ఉందన్నారు.
రంజిత్ ను ఆదర్శంగా తీసుకొని మిగతా రైతులు ఆయిల్ పామ్ నాటేందుకు ముందుకు రావాలని కోరారు. ఆయిల్ పామ్ పంట దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే లాభదాయరకమైన పంట అని చెప్పారు. అనంతరం అదే గ్రామంలో విజయవంతంగా సాగవుతున్న ఆయిల్ పామ్ తోటలను పరిశీలిచారు. ఎరువుల యాజమాన్యం, తెగుళ్లు, నీటి నిర్వహణ, పోషకాహార లోపాలపై సంకేతిక సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరెల్లి రమేశ్, ఉద్యానవన అధికారులు మహేశ్, రాము, ఏవో సంధ్య, ఏఈవో ఈశ్వర్ రెడ్డి, సతీశ్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్స్ అజయ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

