Farmers | సారంగాపూర్, మే 5: రైతులు కాలానికి అనుగుణంగా పంట మార్పిడిపై దృష్టి సారించాలనీ, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని పోతారం గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రాముఖ్యతను వివరించారు.
స్థిరమైన పద్ధతుల్లో వ్యవసాయాన్ని కొనసాగించడానికి రైతులు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన వివరించారు. మే 5 నుండి జూన్ 18 వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయ శాస్త్రవేత్తలకు, రైతులకు మధ్య ఒక ముఖ్యమైన వేధికగా నిలుస్తోందన్నారు. అంతరం శాస్త్రవేత్తలు మాట్లాడుతూ స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, నేల ఆరోగ్య నిర్వహణ, పంట మార్పిడి, యూరియా యొక్క సరైన వినియోగం, వ్యవసాయంలో నీటి యాజమాన్యం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేసార్.
ఈ కార్యక్రమంలో ఏడీఆర్ డాక్టర్ శ్రీలత, ఏడీ డాక్టర్ సైదా నాయక్, ఏడీఏ వీ భాస్కర్, తిరుపతి నాయక్, ఏఓ ప్రదీప్, మాజీ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్, మాజీ ప్రజాప్రతినిధులు గుర్రాల రాజేందర్ రెడ్డి, జోగిని పెళ్లి సుధాకర్ రావు, డిల్లీ రామారావు, బైరీ మల్లేష్ యాదవ్, సాయిలు, జలపతి, గుర్రం స్వామి, నరసింహ రెడ్డి, ఏఈవో వీ వెంకటేష్, శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.